Tirupati: ఈవీఎం గోడౌన్ భద్రతను పరిశీలించిన కలెక్టర్ వెంకటేశ్వర్
Tirupati: రేణిగుంట CWC ఈవీఎం గోడౌన్ భద్రతను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పరిశీలించి, సీసీ కెమెరాలు, సెక్యూరిటీపై అధికారులకు ఆదేశాలిచ్చారు.
Tirupati: ఈవీఎం గోడౌన్ భద్రతను పరిశీలించిన కలెక్టర్ వెంకటేశ్వర్
తిరుపతి జిల్లా,రేణిగుంట.....
ఈవీఎం గోడౌన్ భద్రతను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి జిల్లాకు చెందిన ఈవీఎంలు భద్రపరిచిన రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ) గోదామును జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి డా. ఎస్. వెంకటేశ్వర్ బుధవారం తనిఖీ చేశారు.
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నిర్వహిస్తున్న ప్రతినెలా తనిఖీల్లో భాగంగా ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్, గోదాములోని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు,సీలింగ్ వ్యవస్థ, ఇతర భద్రతా అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి,అనంతరం ఈవీఎం గోదాం రిజిస్టర్‌లో సంతకం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు గోదాములో భద్రంగా భద్రపరిచినట్లు తెలిపారు. ప్రతి నెలా,అలాగే మూడు నెలలకు ఒకసారి గోదాము లోపల తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరా,ఇతర భద్రతా ఏర్పాట్లను నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అదేవిధంగా గోదాం వద్ద 24 గంటలూ పటిష్ట భద్రత, నిరంతర నిఘా కొనసాగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ తనిఖీల్లో శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి,ఈవీఎం గోదాం ఇన్‌చార్జి,జీఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్, రేణిగుంట తహసీల్దార్ శ్రావణ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.




