Renigunta: ప్రమాదాల అడ్డుకట్టే లక్ష్యం.. రంగంలోకి 12 శాఖల అధికారులు

Renigunta: రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేక బస్సు యాత్ర నిర్వహించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 21 April 2026 3:17 PM IST
Renigunta
X

Renigunta: ప్రమాదాల అడ్డుకట్టే లక్ష్యం.. రంగంలోకి 12 శాఖల అధికారులు

Renigunta: రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రమాదాలకు కారణమవుతున్న “బ్లాక్ స్పాట్‌ల”ను గుర్తించి, శాశ్వత పరిష్కారాల కోసం అధికారులు బస్సు యాత్ర నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పన్నెండు శాఖల అధికారులతో కలిసి తిరుపతి నుంచి నాయుడుపేట వరకు ఈ యాత్ర సాగింది. మార్గమధ్యంలో ప్రమాదాలకు కేంద్రంగా మారిన ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా రేణిగుంటలోని గాజుల మండ్యం సర్కిల్ వద్ద బస్సు ఆపి, తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. ప్రమాదాలకు దారితీస్తున్న ఇంజనీరింగ్ లోపాలు, రోడ్డు రూపకల్పనలో ఉన్న సమస్యలు, వాహనాల అతివేగం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మరియు ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ బ్లాక్ స్పాట్‌లలో కేవలం లోపాల సవరణకే పరిమితం కాకుండా, స్పీడ్ గన్స్ ఏర్పాటు, వీధి దీపాల మెరుగుదల, ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ బలోపేతంపై అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా వెస్ట్ బైపాస్ ప్రారంభమైన తర్వాత ప్రమాదాలు పెరిగినట్లు గుర్తించిన అధికారులు, దీనిపై ప్రత్యేక నివారణ చర్యలు చేపడుతునున్నట్లు తెలిపారు.

“జిల్లాలో ఉన్న అన్ని బ్లాక్ స్పాట్‌లను గుర్తించి, ప్రమాదాలను తగ్గించేందుకు సమగ్ర చర్యలు తీసుకుంటాం. ప్రమాదాల అసలు కారణాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, శాశ్వత పరిష్కారాలు అమలు చేస్తాం” అని వెల్లడించారు. అధికారుల ఈ చర్యలతో రాబోయే రోజుల్లో రోడ్డు ప్రమాదాల తీవ్రత గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలిపారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story