Tirupati: తిరుపతి జిల్లా మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాల తనిఖీ: కలెక్టర్ వెంకటేశ్వర్!
Tirupati: తిరుపతి జిల్లా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ప్రారంభమైంది. నాయుడుపేట కౌంటింగ్ కేంద్రాన్ని స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్.
Tirupati: తిరుపతి జిల్లా మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాల తనిఖీ: కలెక్టర్ వెంకటేశ్వర్!
Tirupati: తిరుపతి జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాలు, తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.
తిరుపతి నగరపాలక సంస్థతో పాటు పుత్తూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట పురపాలక సంఘాల పరిధిలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నాయుడుపేట జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ ఫజీలుల్లాతో కలిసి పరిశీలించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను, ఎన్నికల కమిషన్ నిబంధనల అమలును, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, నాయుడుపేట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




