తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమీక్ష.. రంగంలోకి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి!
తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమీక్ష సమావేశం ఘనంగా జరిగింది. ఏఐసీసీ సంయుక్త కార్యదర్శి గణేష్ యాదవ్, ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు.
తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమీక్ష.. రంగంలోకి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి!
తిరుపతి: తిరుపతి జిల్లా డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ సంయుక్త కార్యదర్శి గణేష్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజలకు చేరువ కావాలని, దేశ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సుపరిపాలన, సంక్షేమం అందించడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షులు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి, నెల్లూరు జిల్లా పరిశీలకులు మాంగాటి గోపాల్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి టమటం వెంకట నరసింహులు, ఏఐసీసీ ఓబీసీ కర్ణాటక పరిశీలకులు మురళి, తిరుపతి నగర అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




