Renigunta: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 10 రోజులు జైలు!
Renigunta: రేణిగుంట అర్బన్ పిఎస్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిందితుడికి తిరుపతి స్పెషల్ కోర్టు 10 రోజుల జైలు శిక్ష విధించింది. నేరం ఒప్పుకున్న వెంకటేష్.
Renigunta: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 10 రోజులు జైలు!
Renigunta: మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి తిరుపతిలోని ప్రత్యేక న్యాయస్థానం 10 రోజుల సాధారణ కారాగార శిక్ష విధించింది.
రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిందితుడు పి. వెంకటేష్ (30),తారకరామనగర్, కరకంబాడి,తిరుపతికి చెందినవాడు.మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 185(a) కింద నమోదైన కేసులో నిందితుడు కోర్టులో హాజరై తన నేరాన్ని అంగీకరించాడు.
దీంతో తిరుపతిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించి, మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 185(a) ప్రకారం 10 రోజుల సాధారణ కారాగార శిక్ష విధించింది.
మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర హెచ్చరించారు.
Next Story




