Dakkili: ఎస్‌ఐ చొరవతో ఒక్కటైన ప్రేమికులు.. ఆలయంలో ఘనంగా పెళ్లి!
Dakkili: తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో ప్రేమ పేరిట మనస్పర్ధలతో దూరమైన ప్రేమికులను ఎస్‌ఐ బ్రహ్మనాయుడు కౌన్సిలింగ్ ఇచ్చి, పెద్దల సమక్షంలో ఆలయంలో ఒకటి చేశారు.
Dakkili: ఎస్‌ఐ చొరవతో ఒక్కటైన ప్రేమికులు.. ఆలయంలో ఘనంగా పెళ్లి!
డక్కిలి: తిరుపతి జిల్లా డక్కిలి మండలం గొల్లపల్లె (డి. ఉప్పరపల్లి) దళితవాడకు చెందిన 23 సంవత్సరాల కత్తి రేణుక (చాముండేశ్వరి), అదే గ్రామానికి చెందిన 26 సంవత్సరాల నల్లిపాక వంశీకృష్ణ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.
అయితే ఇటీవలి కాలంలో వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో, పెళ్లికి వంశీ నిరాకరించాడు. దీంతో ప్రియుడు ఎక్కడ దూరమవుతాడోననే భయంతో రేణుక ఆదివారం వంశీ ఇంటి ముందు నిరసనకు దిగి, అనంతరం పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై డక్కిలి ఎస్‌ఐ బ్రహ్మనాయుడు తక్షణమే స్పందించారు.హైదరాబాద్‌లో ఉన్న వంశీని సోమవారం ఉదయానికి స్టేషన్‌కు రప్పించారు.ఇరుపక్షాల వారికి, వంశీ తల్లిదండ్రులకు ప్రస్తుత చట్టాలపై అవగాహన కల్పించి, కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఎస్‌ఐ కౌన్సిలింగ్‌తో మనసు మార్చుకున్న వంశీ, పెద్దల సమక్షంలో పెళ్లికి అంగీకరించాడు.అనంతరం స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీరి వివాహం శాస్త్రోక్తంగా జరిగింది.తమ కుమార్తెకు అండగా నిలిచి, జీవితాన్ని నిలబెట్టిన ఎస్‌ఐ బ్రహ్మనాయుడుకు రేణుక తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.




