Tirupati: ముక్కోటి ఆలయ అభివృద్ధికి సహకరించండి: మంత్రికి విజ్ఞప్తి!
Tirupati: తిరుపతి జిల్లా తొండవాడ ముక్కోటి అగస్తీశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి సహకరించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని భక్తులు కోరారు.
Tirupati: ముక్కోటి ఆలయ అభివృద్ధికి సహకరించండి: మంత్రికి విజ్ఞప్తి!
Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ వద్ద ముక్కోటిలో వెలసిన శ్రీ ఆనంద వల్లి సమేత శ్రీ అగస్తీశ్వరస్వామి వారి దేవాలయాన్ని సందర్శించాలని ఆలయానికి ఉన్న చరిత్ర ఆధారంగా ఆలయ అభివృద్ధి కార్యక్రమాలలో దేవాదాయశాఖను భాగస్వామ్యం చేయాలని స్థానిక భక్తులుగా కుమార రాజారెడ్డి నవీన్ కుమార్ రెడ్డి సుభాష్ రెడ్డి శ్రీకర్ రెడ్డి లు శనివారం నెల్లూరులోని శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారి నివాసంలో ఆలయ ఫౌండర్ ట్రస్టీ మొగిలి ఇందుమౌలి రెడ్డి గారి సూచనల మేరకు మర్యాదపూర్వకంగా కలిసి ముక్కోటి ఆలయ డైరీని బహుకరించి ఆలయాన్ని సందర్శించవలసినదిగా ఆహ్వానించారు
ఈ సందర్భంగా మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ తొండవాడ గ్రామంతో ముక్కోటి ఆలయంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ఆలయ అభివృద్ధికి దేవాదాయశాఖ ద్వారా తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని త్వరలో ఆలయాన్ని సందర్శిస్తానని తెలియజేశారు
ముక్కోటి ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని గొప్ప మనసుతో తెలియజేసిన శ్రీ రామనారాయణ రెడ్డి గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు




