Tirupati: శ్రీకాళహస్తిలో గంజాయి బ్యాచ్‌పై పోలీసుల నిఘా

Tirupati: తిరుపతి జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 20 May 2026 2:53 PM IST
Tirupati
X

Tirupati: శ్రీకాళహస్తిలో గంజాయి బ్యాచ్‌పై పోలీసుల నిఘా

Tirupati: తిరుపతి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు. ప్రతిరోజు వివిధ ప్రాంతాల్లో గంజాయి పై అవగాహన కార్యక్రమాలు. గంజాయి సేవించే వ్యక్తులను గుర్తించి టెస్టులు నిర్వహిస్తున్న పోలీసులు. శ్రీకాళహస్తి డీఎస్పీ కార్యాలయంలో 11 మందికి గంజాయి టెస్టులు. ముగ్గురికి గంజాయి సేవించినట్లు పాజిటివ్ నిర్ధారణ. మొదటిసారి గంజాయి సేవించిన వారికి కౌన్సిలింగ్, అవగాహన కార్యక్రమాలు.

పదేపదే గంజాయి సేవిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక. గంజాయి సరఫరా మూలాలపై ప్రత్యేక దర్యాప్తు. శ్రీకాళహస్తి డివిజన్‌లో గంజాయి నెట్‌వర్క్ నిర్మూలనకు చర్యలు. ప్రజలు సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తామని డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి వెల్లడి. గంజాయి సేవించే వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటామని స్పష్టం. గంజాయి నిర్మూలనలో ప్రజల సహకారం అవసరమని పిలుపు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story