Tirupati: ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: కోడూరు పోలీసులు!

Tirupati: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు బాలికల ఉన్నత పాఠశాలలో సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఈవ్ టీజింగ్ నివారణ, మహిళా భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

PRASAD, KODURU
Published on: 18 Nov 2026 4:45 PM IST
Tirupati
X

Tirupati: ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: కోడూరు పోలీసులు!

కోడూరు: తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, రేణిగుంట SDPO శ్రీ వై. శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో కోడూరు సీఐ చంద్ర శేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొడూరు బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు ఈవ్ టీజింగ్ (మహిళలను వేధించడం) పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ, పాఠశాలలకు వెళ్లే సమయంలో, బహిరంగ ప్రదేశాల్లో, ప్రయాణ సమయాల్లో ఎవరైనా ఆకతాయిలు వేధింపులకు పాల్పడినా, అసభ్యకరంగా ప్రవర్తించినా భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

మహిళలు, బాలికల భద్రతకు కొడూరు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ఈవ్ టీజింగ్, వేధింపులు, అసభ్యకర ప్రవర్తనకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అట్టి చర్యలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

అలాగే విద్యార్థినులకు తక్షణ పోలీస్ సహాయం అందించేందుకు వీలుగా పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన సంప్రదింపు నంబర్లు మరియు అత్యవసర పోలీస్ సహాయ నంబర్లతో కూడిన అవగాహన బ్యానర్‌ను పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.

పోలీస్ సంప్రదింపు నంబర్లు:

SI, కోడూరు: 9121100577

CI, కోడూరు: 9121100578

పోలీస్ అత్యవసర సహాయం: డయల్ 100 / 112

మహిళలు, బాలికల భద్రత కొడూరు పోలీసుల ప్రధాన బాధ్యత అని, ఎటువంటి వేధింపులు ఎదురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని ఈ సందర్భంగా సూచించారు.

PRASAD, KODURU

PRASAD, KODURU