Tirupati: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ బడిలో అడ్మిషన్లు క్లోజ్ బోర్డు!
Tirupati: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం రాజులకండ్రిగ ఆదర్శ పాఠశాలలో సరికొత్త రికార్డు.
Tirupati: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ బడిలో అడ్మిషన్లు క్లోజ్ బోర్డు!
Tirupati: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంమడిబాక గ్రామ పంచాయతీ రాజులకండ్రిగ ఆదర్శ పాఠశాల నందు నో అడ్మిషన్.. అడ్మిషన్లు క్లోజ్..అనే బోర్డు కనిపిస్తే అది ఏదైనా కార్పొరేట్ లేదా ప్రైవేట్ పాఠశాల అనుకుంటారు. కానీ రాజులకండ్రిగ ఆదర్శ పాఠశాల వద్ద ఈరోజు ఈ పరిస్థితి కనిపించింది.
పాఠశాల ప్రారంభమై కేవలం వారం రోజులకే పాతవిద్యార్థులు 90మంది మరియు కొత్తగా చేరిన విద్యార్థులు20 మందిమొత్తం 110మంది చేరడంతో హెడమాష్టర్ బాలసరస్వతి మరియు రత్నకుమార్ ఈ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా మండల విద్యా శాఖాధికారికి తెలియచేశామన్నారు. దాతల సహాయంతో సరస్వతి విగ్రహాన్ని నిర్మించడం జరిగింది.
స్కూల్ నందు డెస్క్ లు, బెంచీలు, మినరల్ వాటర్ ప్లాంట్ విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు ఉన్నాయి. హెడమాష్టర్ బాలసరస్వతి మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్యఅందించడమే తమ లక్ష్య మన్నారు. రత్నకుమార్ మాట్లాడుతూ చుట్టు ప్రక్కల గ్రామ పంచాయతీలకు చెందిన విద్యార్థుల తమ పాఠశాల లో చదువుకుంటున్నారని తెలిపారు.
పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న తల్లిదండ్రులు,పాఠశాల విద్యా నిర్వహణ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు మరియు విద్యాశాకాధికారులకు ప్రధానోపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేశారు.




