Tirupati: శ్రీకాళహస్తి వైఎస్సార్‌సీపీకి షాక్, మిడ్డెల హరి రాజీనామా!

Tirupati: శ్రీకాళహస్తి వైఎస్సార్‌సీపీకి ఎదురుదెబ్బ, మాజీ ఎమ్మెల్యే మిడ్డెల హరి పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 25 Sept 2026 12:02 PM IST
Tirupati
X

Tirupati: శ్రీకాళహస్తి వైఎస్సార్‌సీపీకి షాక్, మిడ్డెల హరి రాజీనామా!

Tirupati: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, పార్టీకి సంబంధించిన పదవులు, బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఏపీఎస్‌ఆర్టీసీ వైస్‌ చైర్మన్ అండ్ డైరెక్టర్ మిడ్డెల హరి ప్రకటించారు.

ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశానని, పార్టీ అధ్యక్షుడు తనపై నమ్మకం ఉంచి ఏపీఎస్‌ఆర్టీసీ వైస్‌ చైర్మన్ అండ్ డైరెక్టర్‌తో పాటు ఏపీసీఓ డైరెక్టర్‌గా, శ్రీకాళహస్తి మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా వివిధ బాధ్యతలు అప్పగించారని లేఖలో పేర్కొన్నారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తన వ్యక్తిగత రాజకీయ నిర్ణయాల నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీకి సంబంధించిన అన్ని పదవులు, బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు మిడ్డెల హరి తెలిపారు.

ఇప్పటివరకు పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించి, బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తనతో కలిసి పనిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు వీడ్కోలు పలుకుతున్నట్లు పేర్కొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI