Tirupati: దామినేడు రహదారి పనులకు భూమిపూజ

Tirupati: తిరుపతి దామినేడు వద్ద నూతన కోర్టు కాంప్లెక్స్ అనుసంధాన రహదారి నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్, తుడా చైర్మన్, ఎమ్మెల్యే పులివర్తి నాని భూమిపూజ చేశారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 13 Oct 2026 6:33 PM IST
Tirupati
X

Tirupati: దామినేడు రహదారి పనులకు భూమిపూజ

Tirupati: తిరుపతి నగరాభివృద్ధి సంస్థ (తుడా) ఆధ్వర్యంలో దామినేడు వద్ద నూతన కోర్టు కాంప్లెక్స్‌కు అనుసంధాన రహదారి నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ప్రారంభించిన మరుసటి రోజు భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తుడా వైస్ ఛైర్మన్ ఆర్. గోవిందరావు, టీటీడీ జేఈవో శరత్ కుమార్, తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ప్రజలు, న్యాయవాదులు, అధికారులు కోర్టు కాంప్లెక్స్‌కు సులభంగా చేరుకునేలా మెరుగైన రవాణా సదుపాయాలు, మౌలిక వసతుల అభివృద్ధికి తుడా కృషి చేస్తోందని తెలిపారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL