Tirupati: గంగమ్మ జాతరలో భారీ బందోబస్తు.. ఎస్పీ సుబ్బరాయుడు వార్నింగ్!

Tirupati: తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 5 May 2026 9:18 AM IST
Tirupati
X

Tirupati: గంగమ్మ జాతరలో భారీ బందోబస్తు.. ఎస్పీ సుబ్బరాయుడు వార్నింగ్!

Tirupati: తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు తిరుపతిలో అత్యంత వైభవంగా నిర్వహించబడే శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. అమ్మవారి జాతర తొమ్మిది రోజుల పాటు ఘనంగా కొనసాగి, ఈ నెల 13వ తేదీన విశ్వరూప దర్శనంతో సమాప్తం కానుంది. జాతర కాలంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆలయ పరిసరాలు, ప్రధాన కూడళ్లు, రాకపోక మార్గాలు, పార్కింగ్ ప్రదేశాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు మాట్లాడుతూ, “శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర తిరుపతి నగరానికి ఆధ్యాత్మికంగా, సాంప్రదాయపరంగా ఎంతో విశిష్టమైనది. జాతరకు హాజరయ్యే ప్రతి భక్తుడు ప్రశాంతంగా, సురక్షితంగా అమ్మవారిని దర్శించుకునేలా జిల్లా పోలీస్ శాఖ అన్ని విధాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి జాతరను విజయవంతం చేయాలి” అని పేర్కొన్నారు.

తిరుపతి సబ్‌డివిజన్ డీఎస్పీ గారు బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బందితో సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మహిళలు, చిన్నారులు, వృద్ధులకు అవసరమైన సహాయం అందించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించిన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI

Next Story