Tirupati: గ్రీన్ కారిడార్ ఏర్పాటు.. విజయవాడ నుంచి తరలించిన గుండె!

Tirupati: విజయవాడ నుంచి ఫ్లై 91 విమానంలో రేణిగుంటకు మానవ గుండెను తరలించారు. తిరుపతి పద్మావతి హృదయాలయానికి చేరవేయడానికి పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 20 Oct 2026 12:57 PM IST
Tirupati
X

Tirupati: గ్రీన్ కారిడార్ ఏర్పాటు.. విజయవాడ నుంచి తరలించిన గుండె!

Tirupati: విజయవాడ నుంచి 'ఫ్లై 91' విమానంలో తీసుకొచ్చిన మానవ గుండె సురక్షితంగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి వేగంగా తరలించేందుకు పోలీసులు ప్రత్యేకంగా 'గ్రీన్ కారిడార్' ఏర్పాటు చేశారు.

ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కట్టుదిట్టమైన భద్రత, ముందస్తు చర్యలతో నిర్ణీత సమయానికే గుండెను ఆసుపత్రికి చేర్చారు. పోలీసుల సమర్థవంతమైన సమన్వయం వల్ల ఒక చిన్నారికి పునర్జన్మ లభించనుంది. అధికారుల స్పందనపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA