Tirupati: మఠం భూముల ఆక్రమణలపై హైకోర్టు తీర్పు హర్షణీయం: శివా నాయక్!
Tirupati: తిరుపతి హాథీరాం బావాజీ మఠం భూముల ఆక్రమణలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని ఆలయ ట్రస్ట్ చైర్మన్ బుక్కే శివా నాయక్ అన్నారు. 2.7 ఎకరాల స్థలంలో పాలాభిషేకం చేశారు.
Tirupati: మఠం భూముల ఆక్రమణలపై హైకోర్టు తీర్పు హర్షణీయం: శివా నాయక్!
తిరుపతి: హాథీరాం బావాజీ మఠం భూముల ఆక్రమణలపై గురువారం హైకోర్టు తీర్పు హర్షనీయమని తిరుపతి శ్రీ హాథీరాం బావాజీ ఆలయ ట్రస్ట్ చైర్మన్ బుక్కే శివా నాయక్ ఆనందం వ్యక్తం చేశారు. తిరుపతి మంచినీళ్ల గుంట వెనుక వైపు ఉన్న మఠం భూముల స్థలంలో బుక్కే శివా నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం హథిరాం బావాజీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, టెంకాయలు కొట్టడం జరిగింది.
ఈ సందర్భంగా శివానాయక్ మాట్లాడుతూ సర్వే నంబర్ 942ఏ లోని 2.7 ఎకరాలు కల్గిన మంచినీళ్ళగుంట వెనక ఉన్న ఈ హాథీరాం బావాజీ మఠంలో విద్యాబోధన కని మూడు దశాబ్దాల ముందు లీజ్ కు తీసుకుని, ఇప్పటికీ తమదే ఈ స్థలమని కోర్టుకెక్కిన ఆక్రమణదారులపై హైకోర్టు గురువారం కేసు కొట్టి వేయడం జరిగిందన్నారు.
అసలు ఏమాత్రం లీజు దారులకు సంబంధంలేని వ్యక్తికి గత ఏడాది దేవాదాయశాఖ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను హైకోర్టు గురువారం సస్పెండ్ చేసిందన్నారు. వెంటనే మఠం అధికారులు ఈ స్థలాన్ని స్వాదీనం చేసుకొని మఠం అభివృద్దికి కృషి చేయాలన్నారు. అదేవిధంగా హాథీరాం బావాజీ ఆస్తులను కాపాడేందుకు తమ వంతు కృషి చేస్తామని శ్రీ హాథీరాం బావాజీ ఆలయ ట్రస్ట్ చైర్మెన్ బుక్కె శివా నాయకు స్పష్టం చేసారు.




