Tirupati: తిరుపతి జిల్లాలో ఏనుగుల సంచారం, ప్రజలు భయాందోళన
Tirupati: తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలంలో 22 ఏనుగులు సంచరిస్తున్నాయి. సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరించింది.
Tirupati: తిరుపతి జిల్లాలో ఏనుగుల సంచారం, ప్రజలు భయాందోళన
అటవీ సరిహద్దు గ్రామాల్లో ఏనుగుల సంచారం
తిరుపతి జిల్లా: య ర్ర వారి పాలెం మండలం కోటకాడ పల్లి పంచాయతీ పరిధిలో ఏనుగులు గుంపు సంచారం కలకలం రేపుతుంది కోటకాడ పల్లి పంచాయతీ సిద్దుల గండి చెరువు వద్ద సుమారు 22 ఏనుగులు గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు అటవీ ప్రాంతానికి సమీపంలో గ్రామాలు వి ఆర్ కాలనీ వేములవాడ. కోట కాడ పల్లె అయ్యంగారిపల్లె పులి గోనుపల్లి నెరబైలు వైపు ఏనుగులు గుంపు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు ఒంటరిగా పంట పొలాల వద్దకు వెళ్ళవద్దని రాత్రి వేళలో అప్రమత్తంగా ఉండాలని ఏనుగు కనిపించిన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని రైతులకు అధికారులు విజ్ఞప్తి చేశారు.
Next Story




