Tirupati: తిరుచానూరు ఎంపీటీసీ 2 స్థానంలో టీడీపీ అభ్యర్థి సుభాషిని విజయం!

Tirupati: తిరుపతి రూరల్ పరిధిలోని తిరుచానూరు ఎంపీటీసీ 2 స్థానంలో టీడీపీ అభ్యర్థి కాళహస్తి సుభాషిని 537 ఓట్ల మెజారిటీతో విజయం. గెలుపును పులివర్తి నానికి అంకితం.

K VENU, TIRUPATHI RURAL
Published on: 8 Nov 2026 8:24 AM IST
Tirupati
X

Tirupati: తిరుచానూరు ఎంపీటీసీ 2 స్థానంలో టీడీపీ అభ్యర్థి సుభాషిని విజయం!

Tirupati: స్థానిక సంస్థల ఎన్నికలలో తిరుపతి రూరల్ (మండలం) తిరుచానూరు ఎంపీటీసీ 2 గా కాళహస్తి సుభాషిని విజయం సాధించారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి వైయస్సార్ సిపి అభ్యర్థి గుప్తా సోనీ తెలుగుదేశం అభ్యర్థికాళహస్తి సుభాషిని నువ్వా నేను అనే రీతిలో పోటా పోటీగా కౌంటింగ్ సాగింది. 537 ఓట్లు మెజార్టీతో తిరుచానూరు ఎంపీటీసీ 2 గా కాళహస్తి సుభాషిని విజయం సాధించారు.

ఈ విజయం కేవలం కాళహస్తి వాసు సతీమణి సుభాషిని అనే ఒక్క వ్యక్తిది మాత్రమే కాదు తిరుచానూరు మేజర్ పంచాయితీలో అభివృద్ధికే పీఠం వేసిన ప్రతి ఒక్క ప్రజానీకానిది! పగలు రాత్రి అనక కష్టపడిన ప్రతీ కార్యకర్త సోదరుడిది, నన్ను గుండెల్లో పెట్టుకున్న ప్రజల స్వేదాన్ని ప్రసాదించిన విజయం ఇది,అభివృద్ధికి, సంక్షేమానికి ఓటేసి గెలిపించిన అనంతరం తిరుచానూరు గ్రామంలో అడుగుపెట్టిన కాళహస్తి సుభాషిని ఈ గెలుపు మా గురువు పులివర్తి నాని అన్నకు అంకితం అని, అదేవిధంగా పులివర్తి సుధా రెడ్డి అక్క, తిరుపత రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, తిరుచానూరు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి ని కలిసిన వేళ వాతావరణం భావోద్వేగంతో నిండిపోయింది.

నాయకుల పాదపద్మాలకు నమస్కరించి, వారి ఆశీస్సులు అందుకుంటున్న సమయంలో ఆయన కళ్ళు ఆనందభాష్పాలతో చెమ్మగిల్లాయి,నన్ను నమ్మి, నిలబెట్టి, వెన్ను తట్టి నడిపించిన మన ప్రియతమ చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని కి జీవితాంతం రుణపడి ఉంటానని కాళహస్తి సుభాషిని గభావోద్వేగానికి గురయ్యారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL