Tirupati: పుల్లంపేటలో రూ.4.75 కోట్ల రోడ్డు ధ్వంసం: కిరణ్ రాయల్ ఫైర్
Tirupati: పుల్లంపేట మండలంలో రూ.4.75 కోట్లతో వేసిన రోడ్డును వైసీపీ నేతలు ధ్వంసం చేశారంటూ జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tirupati: పుల్లంపేటలో రూ.4.75 కోట్ల రోడ్డు ధ్వంసం: కిరణ్ రాయల్ కిరణ్ ఫైర్
తిరుపతి: తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలో రూ.4.75 కోట్లతో నిర్మించిన రహదారిని అర్ధరాత్రి ధ్వంసం చేశారంటూ వైసీపీపై జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే రహదారిని ధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రజల రాకపోకల కోసం నిర్మించిన రోడ్డును ధ్వంసం చేయడం వైసీపీ నేతల అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
రోడ్డు ప్రైవేటు స్థలంలో నిర్మించారంటూ వైసీపీ చేస్తున్న ఫ్యాక్ట్‌చెక్ అవాస్తవమని కిరణ్ రాయల్ పేర్కొన్నారు. ప్రజలు వినియోగించే రహదారిని ధ్వంసం చేయడం హత్యకన్నా దారుణమని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఎస్పీని కోరారు. బాధ్యులను తక్షణమే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు
వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి కిరణ్ రాయల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “పులివెందుల పులి తోక కట్ అయ్యింది.. నీ ఇలాకా కూటమి వశమైంది” అంటూ విమర్శించారు. జగన్ టాబ్లెట్లు వేసుకోకుండా ఎవరిని సస్పెండ్ చేస్తారో అంటూ ఎద్దేవా చేశారు. ఏకగ్రీవాలపై గతంలో జగన్ చేసిన ప్రకటనకు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
కూటమి అభివృద్ధి పనులను అడ్డుకునే ప్రయత్నాలను సహించబోమని కిరణ్ రాయల్ వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. రహదారి ధ్వంసం ఘటనపై పోలీసులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.




