Tirupati: రాయలసీమ విద్యా సంస్థల అధినేత వై.కొండారెడ్డి దశదిన కర్మకు నివాళి

Tirupati: తిరుపతి రాయలసీమ విద్యా సంస్థల అధినేత వై.కొండారెడ్డి దశదిన కార్యక్రమంలో మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 27 Aug 2026 11:32 PM IST
Tirupati
X

Tirupati: రాయలసీమ విద్యా సంస్థల అధినేత వై.కొండారెడ్డి దశదిన కర్మకు నివాళి

తిరుపతి: తిరుపతి రాయలసీమ విద్యా సంస్థల అధినేత వై కొండారెడ్డి గారి దశదిన కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి నివాళులర్పించి, తమ ప్రగాడ సానుభూతి తెలియజేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి తనయుడు మండిపల్లి నిక్సల్ నాగిరెడ్డి తో

పాటు మండిపల్లి రాహుల్ రెడ్డి గారు, రాయచోటి అర్చన విద్యాసంస్థల అధినేత మదన్మోహన్ రెడ్డి, లక్కిరెడ్డిపల్లి మండల అధ్యక్షుడు యనమల మదన్ మోహన్,కొండా రెడ్డి గారి చిత్రపటానికి నివాళులర్పించి, తమ ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.

అనంతరం నిశ్చల్ నాగిరెడ్డి మాట్లాడుతూ కొండారెడ్డి గారు విద్యను వ్యాపారంగా కాకుండా సామాజిక బాధ్యతగా భావించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థి ఉన్నత విద్యకు దూరం కాకూడదనే సంకల్పంతో ఎంతోమంది నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు అండగా నిలిచారని గుర్తు చేశారు.

వేలాది మంది విద్యార్థులకు విద్యను అందించడమే కాకుండా, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేసి జీవితాల్లో కొత్త ఆశలు నింపిన విద్యా ప్రదాత కొండారెడ్డి అని అన్నారు. ఎందరో విద్యార్థుల విజయాల వెనుక ఆయన అందించిన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం ఉన్నాయని పేర్కొన్నారు.

రాయలసీమలో విద్యా వికాసానికి కొండారెడ్డి చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని, ఆయన మృతి విద్యార్థి లోకానికి, విద్యారంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన భౌతికంగా దూరమైనా.. వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలిగించిన అక్షర జ్యోతుల రూపంలో ఎప్పటికీ సజీవంగా ఉంటారని అన్నారు. కొండారెడ్డి ఆశయాలను కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story