Tirupati: తిరుపతి జాతీయ రహదారిపై ప్రమాదం.. మంటల్లో స్క్రాప్ లారీ!

Tirupati: తిరుపతి జిల్లా మామండూరు సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తున్న ఒక స్క్రాప్ లారీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 16 Jun 2026 4:52 PM IST
Tirupati
X

Tirupati: తిరుపతి జాతీయ రహదారిపై ప్రమాదం.. మంటల్లో స్క్రాప్ లారీ!

Tirupati: చెన్నై నుంచి ముంబైకి అల్యూమినియం, ఫ్లైవుడ్ స్క్రాప్ లోడుతో వెళ్తున్న లారీకి తిరుపతి జిల్లా మామండూరు సమీపంలో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో లారీ వెనుక భాగం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన వెనుక నుంచి వస్తున్న వాహనదారులు వెంటనే లారీ డ్రైవర్‌కు సమాచారం అందించారు.

అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే లారీని రోడ్డు పక్కన ఆపి బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే లారీలో ఉన్న అల్యూమినియం, ఫ్లైవుడ్ స్క్రాప్‌లో కొంత భాగం మంటల్లో దగ్ధమైనట్లు సమాచారం.

అగ్నిప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రారంభ సమాచారం మేరకు సాంకేతిక లోపం లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story