Tirupati: గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్ - మొక్క స్వాధీనం

Tirupati: తూర్పుపల్లి ఎస్టీ కాలనీలో ఇంట్లో గంజాయి సాగు చేస్తున్న చలపతిని పోలీసులు అరెస్ట్ చేశారు.

PRASAD, KODURU
Published on: 2 Sept 2026 10:58 PM IST
Tirupati
X

Tirupati: గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్ - మొక్క స్వాధీనం

తిరుపతి: తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, IPS గారి ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయి అక్రమ సాగు, విక్రయం, రవాణా మరియు వినియోగంపై ప్రత్యేక దాడులు, తనిఖీలు నిర్వహిస్తు, ఈ క్రమంలో రేణిగుంట డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో, రైల్వేకోడూరు అర్బన్ సీఐ శ్రీ చంద్ర శేఖర్ గారి పర్యవేక్షణలో, ఎస్‌ఐ శ్రీ వి.ఎల్. ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోలీసులు, ఎక్సైజ్ సిబ్బందితో కలిసి 01.09.2026న తూర్పుపల్లి ఎస్టీ కాలనీలో తనిఖీలు నిర్వహించగ,

ఈ తనిఖీల్లో కనూరు చలపతి (52) అనే వ్యక్తి తన ఇంటి వెనుక భాగంలో వ్యక్తిగత వినియోగం కోసం గంజాయి మొక్కను అక్రమంగా సాగు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో అక్కడ సాగు చేస్తున్న ఒక గంజాయి మొక్కను స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడికి నిర్వహించిన గంజాయి వినియోగ పరీక్షలో పాజిటివ్‌గా ఫలితం వచ్చింది.

ఈ ఘటనపై Cr.No.223/2026 U/s 20(a), 20(b)(i) r/w 8(b) NDPS Act కింద కేసు నమోదు చేసి, చలపతి ను అరెస్ట్ చేసి రిమాండ్ నిమ్మితం గా గౌరవ కోర్టు వారి ముందు హాజరు పరచగా కోర్టు వారు సదరు ముద్దాయికి 15 రోజుల రిమాండ్ విధించగా అతన్ని రాజంపేట సబ్ జైలు కి తరలించడం జరిగింది.

ఈ సందర్భంగా రేణిగుంట డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాసరావు, రైల్వేకోడూరు అర్బన్ సీఐ శ్రీ చంద్ర శేఖర్ మాట్లాడుతూ, గంజాయి సాగు, విక్రయం, అక్రమ రవాణా మరియు వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, గంజాయి సాగు లేదా మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయానికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని వారు కోరారు.

PRASAD, KODURU

PRASAD, KODURU