Tirupati: తిరుపతి మేయర్‌గా ఘన విజయం సాధించిన అభ్యర్థి భావోద్వేగ సందేశం!
Tirupati: తిరుపతి మేయర్‌గా గెలుపుపై స్పందించిన నూతన మేయర్. తన విజయం వెనుక నిరంతరం శ్రమించిన జర్నలిస్టులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ దీపావళి శుభాకాంక్షలు.
Tirupati: తిరుపతి మేయర్‌గా ఘన విజయం సాధించిన అభ్యర్థి భావోద్వేగ సందేశం!
Tirupati: నేను తిరుపతి మేయర్ గా తిరుపతి ప్రజలు నన్ను తమ బిడ్డగా గెలిపించారు. ఈ ఘన విజయం వెనుక మీ కలం ఉంది...మీ కెమెరా ఉంది...మీ అక్షరాలు ఉన్నాయి. ఎండనక, వాననక, నా వెంట మీరు తిరిగారు. నేను మాట్లాడిన ప్రతి మాటను, నేను వేసిన ప్రతి అడుగును ప్రజలకు చేరవేశారు. నా గెలుపు కంటే, మీరు నా కోసం పడిన శ్రమే ఎక్కువ.
ఒక జర్నలిస్ట్ గా మీరు నిష్పక్షపాతంగా ఉండొచ్చు, కానీ తిరుపతి అభివృద్ధి కోసం మీరు చూపిన ప్రేమను నేను మర్చిపోలేను. మీరు రాసిన ఒక్కో వార్త నాకు వేయి ఓట్లతో సమానం.
ఈ గెలుపు నాది కాదు ఇది మీది, ఈ దీపావళి మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, మీ ఇంట్లో వెలిగే ప్రతి దీపం, మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. మీ ఇంట్లో సంతోషం, మీ కుటుంబంలో ఆనందం ఎప్పుడూ ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.




