Tirupati: తిరుపతి మేయర్‌గా జేబీ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్‌గా విజయ!

Tirupati: తిరుపతి నగరపాలక సంస్థ మేయర్‌గా జేబీ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్‌గా పాలడుగు విజయ, 66 మంది కార్పొరేటర్లతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు.

Charan Kumar, Staff Reporter -Tirupathi
Published on: 23 Nov 2026 2:12 PM IST
Tirupati
X

Tirupati: తిరుపతి మేయర్‌గా జేబీ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్‌గా విజయ!

తిరుపతి: తిరుపతి నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం కొలువుదీరింది. నగర మేయర్‌గా జేబీ శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీనివాస ఆడిటోరియంలో అట్టహాసంగా, పండుగ వాతావరణంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం 66 మంది కార్పొరేటర్లతో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా పాలడుగు విజయ ఎన్నికయ్యారు. ఆమెకు 66 మంది కార్పొరేటర్లలో 63 మంది మద్దతు తెలిపారు. దీంతో డిప్యూటీ మేయర్‌గా పాలడుగు విజయ ఎన్నిక ఖరారైంది. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాలడుగు విజయతో డిప్యూటీ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు.

మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారంతో తిరుపతి నగరపాలక సంస్థలో నూతన పాలకవర్గం అధికారికంగా బాధ్యతలు చేపట్టింది. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Charan Kumar, Staff Reporter -Tirupathi

Charan Kumar, Staff Reporter -Tirupathi

11 ఏళ్లుగా ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోని ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.