Tirupati: తిరుపతి: 16 ఏళ్ల ఇంటర్ విద్యార్థి అదృశ్యం, సమాచారం ఇవ్వండి!

Tirupati: తిరుపతి ఎస్‌ఆర్ కళాశాల ఇంటర్ విద్యార్థి కె. అమరేశ్వర్ (16) అదృశ్యం. ఆచూకీ తెలిస్తే గాజులమండ్యం ఎస్‌ఐ హరీష లేదా కుటుంబీకులకు సమాచారమివ్వండి.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 6 Aug 2026 6:09 PM IST
Tirupati
X

Tirupati: తిరుపతి: 16 ఏళ్ల ఇంటర్ విద్యార్థి అదృశ్యం, సమాచారం ఇవ్వండి!

తిరుపతి జిల్లా,గాజుల మండ్యం....

16 ఏళ్ల ఇంటర్ విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి.....ఎస్ఐ హరీష

కళాశాల నుంచి వెళ్లి అదృశ్యం.. ఇంటర్ విద్యార్థి కోసం గాలింపు

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం చెన్నరాజుపోడు గ్రామానికి చెందిన కె. అమరేశ్వర్ (16),తండ్రి విజయ్ కుమార్ అనే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

అమరేశ్వర్ రేణిగుంట మండలంలోని ఎస్‌ఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.ఈ నెల 6వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో కళాశాల నుంచి బయటకు వెళ్లిన అనంతరం తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

అప్పటి నుంచి అతని ఆచూకీ తెలియరాకపోవడంతో గాజులమండ్యం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.కనిపించకుండా పోయిన సమయంలో అమరేశ్వర్ ఎరుపు రంగు టీ-షర్ట్, బ్లూ-వైట్ రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు.ఈ బాలుడు ఎవరికైనా కనిపించినా లేదా అతని ఆచూకీ తెలిసినా వెంటనే గాజులమండ్యం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ 9440900728 లేదా బాలుడి తల్లి ఫోన్ నంబర్లు 8499946707, 6300316007,9652773912లకు సమాచారం అందించాలని ఎస్ఐ హరీష,కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story