Sullurpeta: సూళ్ళూరుపేటలో పోలీసుల ముందస్తు చర్యలు అభినందనీయం
Sullurpeta: సూళ్ళూరుపేటలో శాంతిభద్రతల పరిరక్షణ, సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలీస్ శాఖను కొనియాడిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. ట్రాఫిక్ సమస్యకు త్వరలోనే పరిష్కారం.
Sullurpeta: సూళ్ళూరుపేటలో పోలీసుల ముందస్తు చర్యలు అభినందనీయం
సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు పోలీస్ శాఖ తీసుకుంటున్న ముందస్తు చర్యలు చాలా అభినందనీయమని సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ కొనియాడారు. ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ, ఎస్సై జి. అజయ్ కుమార్లతో పాటు తోటి పోలీస్ సిబ్బందిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలో నేరాల నియంత్రణకు, భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి ప్రధాన కూడళ్ళు, కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. సీసీ కెమెరాల నిఘా వల్ల నేరాలు అదుపులోకి రావడమే కాకుండా, సంఘటనలు జరిగినప్పుడు త్వరితగతిన విచారణ జరిపి నేరస్థులను పట్టుకోవడానికి పోలీసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
ప్రస్తుతం పట్టణంలో చిన్న తరహా ట్రాఫిక్ సమస్య ఒకటి వేధిస్తోందని, దానికి కూడా త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ట్రాఫిక్ సమస్యను పూర్తిగా అధిగమించేందుకు పోలీస్ శాఖతో పాటు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారని, త్వరలోనే అది కూడా పూర్తి కానుందని చెప్పారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, నియోజకవర్గంలో శాంతిభద్రతలను కాపాడుతున్న పోలీస్ అధికారుల పనితీరును ఆమె ప్రశంసించారు.




