Tirupati: చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు - 'నిజం గెలిచింది' వేడుక
Tirupati: తిరుపతి రూరల్‌లో చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో 53 కొవ్వొత్తులతో 'నిజం గెలిచింది' కార్యక్రమం.
Tirupati: చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు - 'నిజం గెలిచింది' వేడుక
తిరుపతి: తిరుపతి రూరల్ మండలం చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో "నిజం గెలిచింది" కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి. నాయకులతో కలసి కొవ్వొత్తి చేతపట్టి చంద్రబాబు నాయుడు పట్ల సంఘీభావాన్ని చాటుకున్నారు.
ప్రజాస్వామ్య విలువలు న్యాయం ధర్మం ఎప్పటికీ గెలుస్తూనే ఉంటుందని అందుకు నిదర్శనం ఇదేనని తెలిపిన ఎమ్మెల్యే. మూడేళ్ల క్రితం గత వైసిపి పాలకులు ఇదే రోజు చంద్రబాబు నాయుడుని అక్రమ అరెస్టు చేసి నిర్బంధించారు.
అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుజాతి మొత్తం 53 రోజులపాటు నిజం గెలవాలి అంటూ చంద్రబాబు నాయుడు కి అండగా నిలిచింది. నాటి చీకటి రోజులను గుర్తు చేస్తూ ... నిజం గెలవాలి అన్న నినాదంతో 53 కొవ్వొత్తులను వెలిగించి చంద్రబాబు నాయుడు కి మేమున్నామంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




