Sullurpeta: సీఎం చంద్రబాబును కలిసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా. విజయశ్రీ!

Sullurpeta: సూళ్లూరుపేట అభివృద్ధి, కాళంగి నదిపై హైలెవల్ బ్రిడ్జి అనుమతుల కోసం సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ కలిశారు. నిధులు మంజూరు చేయాలని కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 Oct 2026 9:28 AM IST
Sullurpeta
X

Sullurpeta: సీఎం చంద్రబాబును కలిసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా. విజయశ్రీ!

Sullurpeta: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ అభివృద్ధి పనులు, కాళంగి బ్రిడ్జి అనుమతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ కలవడం జరిగింది.

సూళ్లూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు, ముఖ్యంగా సూళ్లూరుపేట పట్టణంలోని కాళంగి నదిపై నూతన హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన అనుమతులు, నిధుల మంజూరు విషయమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ కలిశారు.

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలిసిన ఎమ్మెల్యే విజయశ్రీ , నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ప్రధానంగా సూళ్లూరుపేట పట్టణంలోని కాళంగి నదిపై నాలుగు లైన్ల హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేసి, అవసరమైన నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు.

అలాగే సూళ్లూరుపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్యమైన పనులు, ప్రజల అవసరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, వాటికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్