Tirupati: నైపుణ్యానికి పట్టం.. ఇండో-మిమ్ ప్లేస్‌మెంట్స్‌లో ఎంబీయూ విద్యార్థుల హవా!

Tirupati: తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) బీటెక్ మెకానికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న 13 మంది విద్యార్థులు ప్రముఖ సంస్థ 'ఇండో-మిమ్' క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాలు సాధించారు.

VENKATA RAMANA, CHANDRAGIRI
Updated on: 18 Nov 2026 11:55 AM IST
Tirupati
X

Tirupati: నైపుణ్యానికి పట్టం.. ఇండో-మిమ్ ప్లేస్‌మెంట్స్‌లో ఎంబీయూ విద్యార్థుల హవా!

తిరుపతి: తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులు మరోసారి తమ ప్రతిభతో కార్పొరేట్ ప్రపంచంలో సత్తా చాటారు. యూనివర్సిటీలో బీటెక్ మెకానికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న 13 మంది విద్యార్థులు, ప్రముఖ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ 'ఇండో-మిమ్' నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాలు సాధించారు. గత వారం జరిగిన ఎంపిక ప్రక్రియలో విద్యార్థులు తమ నైపుణ్యంతో కొలువులను కైవసం చేసుకున్నారు.

​ఈ విజయంపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పి.వి. రమణ విద్యార్థులను అభినందించారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులకు ఇస్తున్న నాణ్యమైన శిక్షణే ఈ విజయానికి కారణమని కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కె. ఢిల్లీ బాబు,​ కెరియర్ డెవలప్మెంట్ అండ్ ప్లేస్‌మెంట్స్ డైరెక్టర్ అభినయ్ ఐరాల పేర్కొన్నారు.

ఇండో-మిమ్ హెచ్‌ఆర్ మేనేజర్ కిరణ్ కుమార్ దాసరి పర్యవేక్షణలో ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరిగింది. విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానం తమను ఎంతో ఆకట్టుకుందని కిరణ్ కుమార్ ప్రశంసించారు. చదువు పూర్తికాకముందే ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగాలు సాధించడం గర్వకారణం ఉందని మేనేజ్మెంట్ పేర్కొంది.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI