Tirupati: ముండ్లపూడిలో ఘనంగా ‘ఆపరేషన్ త్రిశూల్’ అవగాహన సదస్సు!

Tirupati: తిరుపతి రూరల్ ముండ్లపూడిలో 'ఆపరేషన్ త్రిశూల్' అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రతపై అదనపు ఎస్పీ మాట్లాడారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 25 Sept 2026 8:57 AM IST
Tirupati
X

Tirupati: ముండ్లపూడిలో ఘనంగా ‘ఆపరేషన్ త్రిశూల్’ అవగాహన సదస్సు!

Tirupati: తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముండ్లపూడి గ్రామంలో ఆపరేషన్ త్రిశూల్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏ. శ్రీనివాసులు, అదనపు ఎస్పీ (అడ్మిన్), తిరుపతి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనలు, తిరుపతి జిల్లా ఎస్పీ ఈ. సుబ్బారాయుడు, ఆదేశాల మేరకు ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గ్రామ ప్రజలకు ఆపరేషన్ త్రిశూల్ ముఖ్య ఉద్దేశాలు, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళలు మరియు బాలికల భద్రత, వేధింపుల నివారణ, రోడ్డు ప్రమాదాల నివారణ, యువతను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచడం వంటి అంశాలపై విపులంగా అవగాహన కల్పించారు.

ప్రజలు తమ పరిసరాల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయం, మహిళలు మరియు బాలికలపై వేధింపులు జరిగినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలు పోలీసులతో కలిసి పనిచేస్తే సమాజంలో భద్రత, శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయవచ్చని తెలిపారు.

ఈ సందర్భంగా ఏ. శ్రీనివాసులు, అదనపు ఎస్పీ గ్రామ ప్రజలతో మమేకమై, వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రజల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ సీఐ ప్రసాద్, తిరుచానూరు సీఐ సునీల్ కుమార్, సీఐ నాగార్జున రెడ్డి, ఈగల్ సిబ్బంది మరియు స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL