Tirupati: పేరూరు ప్రభుత్వ బడిలో విద్యాసామాగ్రి పంపిణీ
Tirupati: తిరుపతి రూరల్ మండలం పేరూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచిత విద్యాసామాగ్రి పంపిణీ చేశారు.
Tirupati: పేరూరు ప్రభుత్వ బడిలో విద్యాసామాగ్రి పంపిణీ
Tirupati: తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామపంచాయతీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ బుధవారం విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, పెన్సిల్, పెన్నులు, పలకలు, జామెంట్రీ బాక్స్లు, మెండర్లు, ఎరేజర్లు విద్య సామాగ్రిని అందజేశారు.
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మునీశ్వరయ్య గౌడ్ తో పాటు ఆయన మిత్రబృందం పాల్గొని విద్యార్థులకు విద్యాసామాగ్రిని అందజే శారు. ఈ సందర్భంగా మునీశ్వరి గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన ఏ వస్తువులైన అందజేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
విద్యార్థులు బాగా కష్టపడి చదివి ప్రభుత్వ పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో నే విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు స్థానికులు నాయకులు పాల్గొన్నారు.




