Gajulamandyam : రేణిగుంట కాలేజీలో తిరుపతి పోలీసుల డ్రగ్స్ అవగాహన సదస్సు

Gajulamandyam : తిరుపతి జిల్లా రేణిగుంట ఓవీఆర్ కళాశాలలో గాజులమండ్యం సీఐ ఆధ్వర్యంలో “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన సదస్సు. డ్రోన్ల పర్యవేక్షణతో కట్టుదిట్టమైన చర్యలు.

JALEEL, NAGARI & RENIGUNTA
Updated on: 25 Jun 2026 8:24 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట కాలేజీలో తిరుపతి పోలీసుల డ్రగ్స్ అవగాహన సదస్సు

రేణిగుంట: తిరుపతి జిల్లాను నేరరహితంగా మార్చేందుకు పోలీసు శాఖ సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదంతో యువతలో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పిస్తూ,ఈగల్ క్లబ్స్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ఈ క్రమంలో గాజులమండ్యం సీఐ శ్రీమంజునాధ్ రెడ్డి ఆధ్వర్యంలో రేణిగుంటలోని ఓవీఆర్ కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు,వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు వివరించారు.

అలాగే సైబర్ నేరాలు,పోక్సో కేసులు, ఆర్థిక మోసాలపై కూడా అవగాహన కల్పిస్తూ,విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.డ్రోన్ల పర్యవేక్షణతో జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణ చర్యలు మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కార్యక్రమం విద్యార్థులు,కళాశాల యాజమాన్యం,పోలీసులు కలిసి “డ్రగ్స్ వద్దు బ్రో” అంటూ నినాదాలు చేస్తూ యువతలో చైతన్యం పెంపొందించే సందేశాన్ని ఇచ్చారు.

అసాంఘిక కార్యకలాపాలు, మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు వెంటనే డయల్ 112 లేదా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని,ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని జిల్లా పోలీసులు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు,విద్యార్థులు, గాజులమండ్యం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story