Gajulamandyam: తిరుపతిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్: రాగి వైర్ల దొంగతనాలకు పాల్పడుతున్న 7 మంది జైలుకు!
Gajulamandyam: తిరుపతి జిల్లా గాజులమండ్యం ఇండస్ట్రియల్ ఏరియాలో రాగి వైర్లు, కాపర్ సామగ్రి దొంగతనాలకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన 7 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Gajulamandyam: తిరుపతిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్: రాగి వైర్ల దొంగతనాలకు పాల్పడుతున్న 7 మంది జైలుకు!
రేణిగుంట: తిరుపతి జిల్లా గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రిపూట రాగి వైర్లు, కాపర్ సామగ్రి దొంగతనాలకు పాల్పడుతున్న 7 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఆర్ల శ్రీనివాస్ పర్యవేక్షణలో, రేణిగుంట డీఎస్పీ వై.శ్రీనివాసరావు మార్గదర్శకత్వంలో రేణిగుంట రూరల్ సీఐ ఎం.మంజునాథ్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం ఈ కేసును ఛేదించింది.ఎర్రమరెడ్డిపాలెం ఇండస్ట్రియల్ ఏరియాలోని ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ కంపెనీలో ఇటీవల రాగి వైర్లు, కాపర్ బస్ బార్లు చోరీ జరిగిన ఘటనపై కేసు నమోదు చేశారు.సీసీటీవీ ఫుటేజ్,టోల్ ప్లాజా వివరాలు,సాంకేతిక ఆధారాల సహాయంతో తమిళనాడుకు చెందిన 7 మందిని గుర్తించి తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితులు దొంగతనం చేసిన సొత్తును అమ్ముకొని మళ్లీ చోరీలకు పాల్పడేందుకు వచ్చినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోంది. కేసును ఛేదించిన గాజులమండ్యం పోలీస్ సిబ్బందిని అధికారులు అభినందించారు.




