Puttur: పుత్తూరు శ్రీవిద్య కళాశాలలో మహిళా భద్రతపై అవగాహన
Puttur: పుత్తూరు శ్రీవిద్య డిగ్రీ కళాశాలలో మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు. పాల్గొన్న డీఎస్పీ రవికుమార్, ఇన్‌స్పెక్టర్ వెంకట లక్ష్మి.
Puttur: పుత్తూరు శ్రీవిద్య కళాశాలలో మహిళా భద్రతపై అవగాహన
పుత్తూరు: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాలు మేరకు పుత్తూరు డీఎస్పీ జి.రవికుమార్ పర్యవేక్షణలో పుత్తూరు అర్బన్ పోలీసులు శ్రీవిద్య డిగ్రీ కళాశాలలో మహిళల భద్రత, మహిళలపై జరిగే నేరాలు, సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
పుత్తూరు అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్, మహిళా ఎస్‌ఐ వెంకట లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బందితో పాటు సుమారు 180 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళల భద్రత, గృహహింస, లైంగిక వేధింపులు, సైబర్ మోసాలు, సోషల్ మీడియా భద్రత, మహిళల చట్టపరమైన హక్కులు, డయల్-112 అత్యవసర సేవల వినియోగం, పోలీసులకు ఫిర్యాదు చేసే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని, మహిళల భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, బ్యాంకు సమాచారం ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు.




