Tirupati: తిరుపతి జిల్లాలో పోలీసుల విస్తృత అవగాహన సదస్సులు
Tirupati: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు గ్రామ సభలు, ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించారు.
Tirupati: తిరుపతి జిల్లాలో పోలీసుల విస్తృత అవగాహన సదస్సులు
తిరుపతి జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు గ్రామ సభలు, ఫ్లాగ్ మార్చ్‌ల ద్వారా ప్రజల్లో భద్రతపై నమ్మకం కల్పిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపడుతున్నారు.
ఈ సందర్భంగా గ్రామ సభలు నిర్వహించి అభ్యర్థులు, ప్రజలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన కల్పిస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో గొడవలు, ఘర్షణలకు పాల్పడరాదని, ఓటర్లను డబ్బు, మద్యం, ఇతర వస్తువులతో ప్రలోభపెట్టరాదని సూచిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు, కార్యకర్తల పట్ల సంయమనం పాటించాలని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహిస్తూ ప్రజలకు పోలీసుల భద్రతా భరోసా కల్పిస్తున్నారు. వాహన తనిఖీలు, నిరంతర పెట్రోలింగ్ ద్వారా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిఘా కొనసాగిస్తున్నారు.




