Srikalahasti: శ్రీకాళహస్తిలో పోలీసుల మెరుపు దాడులు.. 10 బైకులు సీజ్!
Srikalahasti: శ్రీకాళహస్తి కైలాసగిరి కాలనీలో పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ ఆదేశాలతో జరిగిన తనిఖీల్లో పత్రాలు లేని 10 బైక్‌లను సీజ్ చేశారు.
Srikalahasti: శ్రీకాళహస్తిలో పోలీసుల మెరుపు దాడులు.. 10 బైకులు సీజ్!
శ్రీకాళహస్తి: నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ తిరుపతి జిల్లా పోలీసులు శ్రీకాళహస్తిలో వీక్లీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పత్రాలు లేని పది మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి డీఎస్పీ శ్రీ కె. నరసింహమూర్తి ఆధ్వర్యంలో వీక్లీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
ఈరోజు ఉదయం 5:30 గంటల నుంచి శ్రీకాళహస్తి కైలాసగిరి కాలనీలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, నివాస ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు లేని 10 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం వంటి పత్రాలను వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచించారు.
ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసం ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని శ్రీకాళహస్తి టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు తెలిపారు.




