Puttur: పుత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి!
Puttur: తిరుపతి జిల్లా పుత్తూరు కేకేసీ కళాశాల సమీపంలో ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందగా, 10 మంది ఎంపీహెచ్డబ్ల్యూ విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి.
Puttur: పుత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి!
పుత్తూరు: పుత్తూరు కేకేసి కళాశాల సమీపంలో లారీ, ఆటో ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, పది మంది ఎంఎల్టీ విద్యార్థులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. పుత్తూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో MPHW విద్యనభ్యసిస్తున్న పది మంది విద్యార్థినులు శిక్షణలో భాగంగా పరమేశ్వర మంగళం సమీపంలోని అన్నా గౌరీ వైద్యశాలకు వెళ్లారు. అయితే శిక్షణ ముగించుకుని ఆటోలో తిరిగి పుత్తూరుకు వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఆటోను బలంగా ఢీకొంది.
ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థినులకు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో ఓ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. ప్రమాద ఘటనతో విద్యార్థినుల కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నారు.ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




