Tirupati: క్వాంటం కంప్యూటింగ్‌తో కొత్త ఆవిష్కరణలు
Tirupati: తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో క్వాంటం కంప్యూటింగ్, భవిష్యత్తు సాంకేతికతలపై సదస్సు; విద్యార్థులకు అవగాహన కల్పించిన ప్రొఫెసర్ వి. వాసుదేవరావు.
Tirupati: క్వాంటం కంప్యూటింగ్‌తో కొత్త ఆవిష్కరణలు
తిరుపతి: భవిష్యత్తు సాంకేతిక విప్లవంలో క్వాంటం కంప్యూటింగ్ కీలక పాత్ర పోషించనుందని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ సలహాదారు, ఐఐటీ తిరుపతి అడ్జంక్ట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ వి. వాసుదేవరావు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులు, నూతన ఆవిష్కరణలు ప్రపంచ అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తున్నాయని వివరించారు.
మోహన్ బాబు యూనివర్సిటీలో శుక్రవారం భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో, ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సహకారంతో ఈ సదస్సు నిర్వహించారు. క్వాంటం కంప్యూటింగ్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, భవిష్యత్తు అనువర్తనాలు అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. యూనివర్సిటీలోని దాసరి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ వి. వాసుదేవరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా క్వాంటం కంప్యూటింగ్ సాంకేతికత ప్రాధాన్యత, భవిష్యత్తులో వివిధ రంగాల్లో దాని వినియోగ అవకాశాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించే అంశాలు చర్చించారు. సంప్రదాయ కంప్యూటింగ్‌కు భిన్నంగా క్వాంటం కంప్యూటింగ్ అందించగల అవకాశాలు, పరిశోధన రంగంలో దాని ప్రాధాన్యతను వివరించారు.




