Tirupati: SGF తైక్వాండో పోటీల్లో రెయిన్బో విద్యార్థుల పతకాల పంట
Tirupati: తిరుపతి జెడ్పీహెచ్ఎస్ ఎం.ఆర్.పల్లిలో జరిగిన SGF తైక్వాండో పోటీల్లో రెయిన్బో గ్రూప్ విద్యార్థులు పలు పతకాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
Tirupati: SGF తైక్వాండో పోటీల్లో రెయిన్బో విద్యార్థుల పతకాల పంట
Tirupati: జెడ్పీహెచ్ఎస్,ఎం.ఆర్.పల్లి, తిరుపతిలో నిర్వహించిన SGF తైక్వాండో టోర్నమెంట్ 2026–27లో రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. U-14, U-17, U-19 విభాగాల్లో పోటీపడిన విద్యార్థులు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు.
బాలుర విభాగంలో కనిష్క్ గోల్డ్ మెడల్ సాధించగా, సాయి ధర్మ తేజ్, జ్ఞానేశ్వర్, మస్తాన్, ఇస్మాయిల్ సిల్వర్ మెడల్స్ సాధించారు. గీతమ్, జ్ఞాన స్వరూప్, హుస్సేన్, నిహాస్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు.
బాలికల విభాగంలో క్యాథరిన్, చాంచల్ చౌహాన్, అలియా హబీబా గోల్డ్ మెడల్స్ సాధించగా, జ్వాల, జాహ్నవి సిల్వర్ మెడల్స్, ఆఫియా, షబ్నమ్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. U-19 విభాగంలో షబ్నమ్, ప్రదీప్ గోల్డ్ మెడల్స్ సాధించారు.
గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు రాష్ట్రస్థాయి SGF తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరస్పాండెంట్ పి.ఎ. ఖాన్, ప్రిన్సిపాల్ షహేర్ బాను విద్యార్థులను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.
విద్యార్థులకు శిక్షణ అందించిన తైక్వాండో కోచ్ లోకేష్‌ను పాఠశాల యాజమాన్యం అభినందించింది.




