Tirupati: వైసీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ వైస్ ప్రెసిడెంట్‌గా రామచంద్రారెడ్డి

Tirupati: వైసీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ వైస్ ప్రెసిడెంట్‌గా రామచంద్రారెడ్డి నియామకం. చెవిరెడ్డి కుటుంబానికి కృతజ్ఞతలు. 2029లో పార్టీని గెలిపించడమే లక్ష్యమన్న ఆయన.

K VENU, TIRUPATHI RURAL
Published on: 19 July 2026 6:56 PM IST
Tirupati
X

Tirupati: వైసీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ వైస్ ప్రెసిడెంట్‌గా రామచంద్రారెడ్డి

తిరుపతి: వైయస్సార్సీపి రాష్ట్ర పంచాయతీరాజ్ వైస్ ప్రెసిడెంట్ గా రామచంద్ర రెడ్డి నియమితులయ్యారు. వైయస్సార్సీపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయనకు అధికారిక నియమక పత్రాలను అందజేశారు.

చంద్రగిరి నియోజకవర్గ ముఖ్య నాయకులు ఆయన అభిమానులు కార్యకర్తలు ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా మీడియా సమావేశంలో రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తనకు ఈ బాధ్యతమైన పదవి రావడానికి ప్రత్యేకంగా కృషి చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పంచాయతీ రాజ్ వేదికగా పార్టీ సిద్ధాంతాలను ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లమన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ 2029లో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులతో కలిసి శ్రమిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL

Next Story