Renigunta: బుగ్గ స్ట్రీట్‌లో పల్లె నిద్ర.. ప్రజలకు అవగాహన కల్పించిన డీఎస్పీ!

Renigunta: బుగ్గ స్ట్రీట్‌లో పోలీసులు 'పల్లె నిద్ర' కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలనపై డీఎస్పీ శ్రీనివాసరావు ప్రజలకు అవగాహన కల్పించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 22 Aug 2026 9:45 PM IST
Renigunta
X

Renigunta: బుగ్గ స్ట్రీట్‌లో పల్లె నిద్ర.. ప్రజలకు అవగాహన కల్పించిన డీఎస్పీ!

రేణిగుంట: రేణిగుంట ఎస్‌డీపీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం బుగ్గ స్ట్రీట్‌లో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, గంజాయి వినియోగం–అక్రమ రవాణా, ట్రాఫిక్ నిబంధనలు తదితర అంశాలపై పోలీసులు అవగాహన కల్పించారు.

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించారు. మహిళలు, యువత భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తూ, ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.అదేవిధంగా గంజాయి వంటి మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని పోలీసులు సూచించారు. కార్యక్రమంలో రేణిగుంట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌ జయచంద్రతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story