Renigunta: జె. చిత్రకు అఖండ విజయం అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు
Renigunta: రేణిగుంట గ్రామ సర్పంచ్‌గా జె. చిత్రను అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజల తీర్పుకు శిరసు వంచి నమస్కరిస్తున్నామని టీడీపీ పట్టణ అధ్యక్షుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Renigunta: జె. చిత్రకు అఖండ విజయం అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు
రేణిగుంట: రేణిగుంట గ్రామ సర్పంచ్‌గా డీపీ కోడలు జె. చిత్రను అఖండ మెజారిటీతో గెలిపించి చారిత్రాత్మక విజయాన్ని అందించిన గ్రామ ప్రజలకు టీడీపీ పట్టణ అధ్యక్షుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు చూపిన ఆదరాభిమానాలు, కార్యకర్తల అహర్నిశల కృషి,కూటమి పార్టీ శ్రేణుల సమిష్టి పోరాటం ఈ విజయానికి ప్రధాన బలమని పేర్కొన్నారు. ఈ విజయం కేవలం ఒక వ్యక్తి గెలుపు మాత్రమే కాదని, రేణిగుంట ప్రజల నమ్మకానికి, ఆశీర్వాదానికి ప్రతీక అని అభివర్ణించారు.
తమపై నమ్మకంతో జె. చిత్రకు పట్టం కట్టిన ప్రతి ఓటరుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ రేణిగుంటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు అందించిన ఈ చారిత్రాత్మక విజయాన్ని బాధ్యతగా స్వీకరిస్తూ, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని టీడీపీ పట్టణ అధ్యక్షుడు స్పష్టం చేశారు.




