Renigunta: ‘హెచ్‌పీవీ’ టీకా గడువు మరో 3 నెలలు పొడిగింపు
Renigunta: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు అందించే హెచ్‌పీవీ (HPV) టీకా గడువును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది.
Renigunta: ‘హెచ్‌పీవీ’ టీకా గడువు మరో 3 నెలలు పొడిగింపు
Renigunta: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు చేపట్టిన హెచ్ పి వి టీకా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించినట్లు హెల్త్ సూపర్వైజర్ కామరాజు తెలిపారు.14 సంవత్సరాలు పూర్తి చేసి 15 సంవత్సరాలు నిండని బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని టీకా వేయించుకోవాలని కోరారు.
రేణిగుంట ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ,టీకా పూర్తిగా సురక్షితమైందని, ఎలాంటి భయాందోళనలు అవసరం లేదన్నారు.
రేణిగుంట మండలంలో అర్హులైన 410 మంది బాలికల్లో ఇప్పటివరకు 355 మందికి టీకాలు అందించి 87 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు వెల్లడించారు. విద్యాసంస్థలు పునఃప్రారంభమైన నేపథ్యంలో మిగిలిన బాలికలకు ఆగస్టు నెలలోగా టీకా పంపిణీ పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
ఇప్పటివరకు ఎటువంటి రియాక్షన్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్యామల,వైద్య సిబ్బంది,ఆశా కార్యకర్తలు,ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.




