Renigunta: రేణిగుంట మండలంలో ఉదయం 10 గంటల వరకు 43.44% పోలింగ్!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని 15 పంచాయతీల పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో ఉదయం 10 గంటల వరకు 43.44 శాతం పోలింగ్ నమోదైంది. మహిళా ఓటర్లదే పైచేయిగా నిలిచింది.
Renigunta: రేణిగుంట మండలంలో ఉదయం 10 గంటల వరకు 43.44% పోలింగ్!
రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. మండలంలోని 15 పంచాయతీల పరిధిలో మొత్తం 182 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు మొత్తం 58,798 మంది ఓటర్లకు గాను 25,539 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.దీంతో 43.44 శాతం పోలింగ్ నమోదైంది.
ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో 12,329 మంది పురుషులు కాగా, 13,210 మంది మహిళలు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 881 మంది అధికంగా ఓటు వేయడం విశేషం.
పంచాయతీల వారీగా పోలింగ్ శాతం:
అత్తూరు – 49.10%, ఎలమండ్యం – 57.85%, గాజులమండ్యం – 73.94%, గురవరాజుపల్లె – 53.80%, జీపాలెం – 52.29%, కరకంబాడి – 40.67%, కృష్ణాపురం – 51.38%, మామండూరు – 56.03%, ఆర్. మల్లవరం – 60.72%, రేణిగుంట – 27.28%, సూరప్పకాసం – 64.05%, తండ్లం – 61.56%, తూకివాకం – 40.92%, వెంకటాపురం – 56.46%, విప్పమాని పట్టెడ – 67.96%
పంచాయతీల వారీగా పరిశీలిస్తే గజులమండ్యంలో అత్యధికంగా 73.94 శాతం పోలింగ్ నమోదవగా, రేణిగుంటలో అత్యల్పంగా 27.28 శాతం నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.




