Renigunta: రామకృష్ణాపురంలో రేణిగుంట పోలీసుల 'పల్లె నిద్ర'!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం రామకృష్ణాపురంలో పోలీసులు ‘పల్లె నిద్ర’ నిర్వహించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 26 Aug 2026 9:02 PM IST
Renigunta
X

Renigunta: రామకృష్ణాపురంలో రేణిగుంట పోలీసుల 'పల్లె నిద్ర'!

రేణిగుంట: రామకృష్ణాపురం గ్రామంలో రేణిగుంట పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో పోలీసులు మమేకమై స్థానిక సమస్యలపై చర్చించారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో నెలకొన్న సమస్యలు,ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని అధికారులు కోరారు.

ఈ కార్యక్రమంలో రేణిగుంట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జయచంద్ర పాల్గొని ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలకు భద్రత కల్పించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని,శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story