Renigunta: మహిళల భద్రతే లక్ష్యం రేణిగుంటలో పోలీసుల అవగాహన సదస్సు!
Renigunta: రేణిగుంట తారకరామ నగర్లో మహిళల భద్రతపై అవగాహన సదస్సు. 'శక్తి' యాప్, 112 అత్యవసర నంబర్‌పై ఇన్స్పెక్టర్ జయచంద్ర, ఎంపీడీవో రవిచంద్ర అవగాహన.
Renigunta: మహిళల భద్రతే లక్ష్యం రేణిగుంటలో పోలీసుల అవగాహన సదస్సు!
Renigunta: మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు రేణిగుంట పోలీసులు ప్రత్యేక సదస్సును నిర్వహించారు.గురువారం రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలోని తారకరామ నగర్లో ఉన్న ఎన్వీఆర్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి రేణిగుంట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్. జయచంద్ర,రేణిగుంట మండల ఎంపీడీవో రవిచంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఎస్. జయచంద్ర మాట్లాడుతూ మహిళల భద్రతకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.ప్రతి మహిళ ఆత్మరక్షణ (సెల్ఫ్ డిఫెన్స్) నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన 'శక్తి' మొబైల్ యాప్‌ను ప్రతి మహిళ తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని వినియోగించాలని కోరారు.
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112 అత్యవసర సేవల నంబర్‌కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలని సూచించారు. అలాగే సైబర్ మోసాలు, చైన్ స్నాచింగ్, ఆన్లైన్ మోసాలు, మహిళలపై జరిగే నేరాల నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలో వివరించారు. అపరిచితుల ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు.
ఈ అవగాహన సదస్సులో మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పోలీసు సిబ్బంది పాల్గొని మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన పొందారు.




