Renigunta: రేణిగుంట 9వ వార్డు సభ్యుడిగా సోలా మల్లికార్జునరెడ్డి ఏకగ్రీవం!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం 9వ వార్డు సభ్యుడిగా సోలా మల్లికార్జునరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై ఎన్నికల అధికారి చేతుల మీదుగా ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 21 Nov 2026 4:29 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట 9వ వార్డు సభ్యుడిగా సోలా మల్లికార్జునరెడ్డి ఏకగ్రీవం!

రేణిగుంట: రేణిగుంట మండలంలో 9వ వార్డు సభ్యుడిగా సోలా మల్లికార్జునరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి చేతుల మీదుగా ఆయన ధృవీకరణ పత్రాన్ని స్వీకరించారు.ఏకగ్రీవ విజయంతో సోలా మల్లికార్జునరెడ్డిని పలువురు కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.

పూలమాలలు, శాలువాలతో సత్కరిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏకగ్రీవ ఎన్నికతో మల్లికార్జునరెడ్డి వర్గీయుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA