Renigunta: రేణిగుంట జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి పాడి మమత నామినేషన్!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా పాడి మమత నామినేషన్ దాఖలు చేశారు. బీ-ఫారం కేటాయించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Renigunta: రేణిగుంట జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి పాడి మమత నామినేషన్!
రేణిగుంట: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రేణిగుంట మండల జడ్పీటీసీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పాడి మమత గురువారం కలెక్టర్ ఆఫీస్ నందు నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా పార్టీ తనకు బి-ఫారం కేటాయించడంపై హర్షం వ్యక్తం చేసిన ఆమె, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
పార్టీ తనపై నమ్మకంతో జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. టీడీపీ మండలం అధ్యక్షులు చంద్రారెడ్డి, పట్టణం అధ్యక్షులు మహబూబ్ బాషా,పార్టీ నాయకులు,కార్యకర్తల సహకారంతో ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేస్తానని తెలిపారు.




