Pakala: పాకాల వద్ద ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు!

Pakala: పాకాల మండలం గాదంకి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఆటో వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 25 Jun 2026 3:43 PM IST
Pakala
X

Pakala: పాకాల వద్ద ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు!

పాకాల: తిరుపతి జిల్లా, పాకాల మండలం, చిత్తూరు తిరుపతి జాతీయ రహదారి నదు గాదంకి గ్రామం దగ్గర గల ఫారెస్ట్ద చెక్పోస్ట్ ముందర జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి, , 7 గురు కి గాయాలు.

ఈ దినము అనగా 24.6.26 నాడు AP 39UF 4356 అను నెంబర్ గల లారీ డ్రైవర్ షేక్ బాజీ బాబ వయసు 47 సం, తండ్రి. మస్తాన్ వలి, కుజురు నగర్, సూర్య పేట, తెలంగాణ రాష్ట్రం. అను అతను ప్లైవుడ్ లోడుతో వెళ్తున్న లారీ బెంగళూరు నుంచి బయలుదేరి శ్రీకాళహస్తి దగ్గర గల చింపేడు గ్రామంలో ఉండే కట్టెల ఫ్యాక్టరీకి వెళుతున్నది.

AP 39UB 1993 అను నెంబర్ గల ఆటో డ్రైవరు పుత్తూరు మండలం, నెల్లేపల్లి గ్రామానికి చెందిన సుబ్రమణ్యం అనే అతను యాదమర్రి మండలం, పెరుమల పల్లి గ్రామం నుంచి బయలుదేరి తిరుపతి లో వాళ్ళ బంధువుల పెళ్లి కి వెళుతూ ఉడగా సమయం 12.55 pm గంటల ప్రాంతంలో ముందు వెళ్తున్న లారీ సడన్గా బ్రేక్ వేసి, ఎలాంటి ఇండికేటర్లు వేయకుండా వాహనము రోడ్డుపై ఆపడంతో, ఆటో డ్రైవరు సదర్ లారీని వెనుక వైపున గుద్దినాడు.

ఆ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 1) యనమల మాధవి 40 సం భర్త పేరు కన్నయ్య, ఏనుగుంట పల్లి గ్రామం, తవణం పల్లి మండలం, చిత్తూరు జిల్లా, కులం SC మాదిగ. మరియు ఆమె కూతురు మేఘన వయసు 15 సం, studied 10 th class అణువార్లు అక్కడికక్కడే చనిపోయారు. మిగిలిన ప్రయాణికులు మరియు ఆటో డ్రైవరు తిరుపతి రుయా హస్పిటల్ కు అంబులెన్స్ లో తీసుకెళ్లినారు. సదరు ప్రయాణికులలో ఇంకొక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నది. అతను పులకింటి రాజా శేఖర్ వయసు 25 సం తండ్రి పేరు రఘు, పెరుమల పల్లి గ్రామం, యాదమర్రి మండలం అనే అతను కూడా చనిపోయాడు.

గాయాలు తగిలిన వారు.

1. పులకింటి నవీన్ వయసు 14 సం

2. కొమ్ము విష్ణు 19 సం,

3. ఎనుమల సూరి వయసు 17 సం

4. పులకింటి బేబీ వయసు 50 సం

5. పులకింటి Chinnabba age 50 సం

6. పులకింటి రఘు 55 సం

7. చాముండేశ్వరి age 30 సం.

8. Auto driver పులకింటి subramanyam. Age 50 సం.

అనువార్లు గాయపడ్డారు. ఈ ప్రమాదమునకు లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఎలాంటి ఇండికేటర్ లేకుండా వాహనమును రోడ్డుపై వెళ్తూ బ్రేక్ వేయడం వలన వెనుక వస్తున్నా ఆటో గుద్దడం తో ఈ ప్రమాదం జరిగింది. సదరు లారీ డ్రైవర్ పై చర్య తీసుకోమని వారి బంధువులు పిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తాము అని పాకాల పోలీసులు తెలిపినారూ.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story