Tirupati: ప్రయాణికురాలికి బంగారు మంగళసూత్రం అందజేసిన ఆర్పీఎఫ్

Tirupati: తిరుపతిలో రైలులో మరిచిపోయిన రూ.3 లక్షల విలువైన బంగారు మంగళసూత్రాన్ని ‘రైల్ మదద్’ ఫిర్యాదుతో గుర్తించి బాధితురాలికి అప్పగించిన ఆర్పీఎఫ్ సిబ్బంది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 11 Aug 2026 11:38 PM IST
Tirupati
X

Tirupati: ప్రయాణికురాలికి బంగారు మంగళసూత్రం అందజేసిన ఆర్పీఎఫ్

తిరుపతి: రైలులో ప్రయాణికురాలు మరిచిపోయిన రూ.3 లక్షల విలువైన బంగారు మంగళసూత్రాన్ని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది గుర్తించి బాధితురాలికి సురక్షితంగా అప్పగించారు.

దర్శి ప్రాంతానికి చెందిన ఎం.కవిత గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా, B-2 కోచ్‌లోని తన బెర్త్ వద్ద దిండు కింద 24 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని ఉంచి మరిచిపోయారు. రైలు దిగిన అనంతరం ఆభరణం కనిపించకపోవడంతో Rail Madad ద్వారా ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న వెంటనే ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఎం.సందీప్ కుమార్ పర్యవేక్షణలో సిబ్బంది రైలును తనిఖీ చేశారు.ఈ సందర్భంగా మంగళసూత్రాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.అనంతరం వివరాలను నిర్ధారించి బాధితురాలికి ఆభరణాన్ని అప్పగించారు.

ఆర్పీఎఫ్ సిబ్బంది చొరవతో విలువైన ఆభరణం తిరిగి లభించడంతో బాధితురాలు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story