Mallavaram: మల్లవరం టీడీపీ ఎంపీటీసీగా మనోహర్ చౌదరి ప్రమాణస్వీకారం!
Mallavaram: తిరుపతి రూరల్ మండలం మల్లవరం టీడీపీ ఎంపీటీసీగా చిగురుపాటి మనోహర్ చౌదరి శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేశారు.
Mallavaram: మల్లవరం టీడీపీ ఎంపీటీసీగా మనోహర్ చౌదరి ప్రమాణస్వీకారం!
మల్లవరం: తిరుపతి రూరల్ మల్లవరం టిడిపి ఎంపీటీసీగా చిగురుపాటి మనోహర్ చౌదరి ప్రమాణస్వీకారం చేశారు రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం లో ఆయన మొదటి నెంబర్గా రిటర్నింగ్ అధికారి ఆర్ యశ్వంత్ ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం మనోహర్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు తన పదవి కాలంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు . మల్లవరం గ్రామం లో నిలిచిపోయిన రోడ్లు డ్రైనేజీ కాలువ నిర్మాణాలను మండలం ప్రజా పరిషత్ నిధులతో నిర్మించే దిశగా చొరవ చూపుతానని ఎంపిటిసి మనోహర్ చౌదరి తెలిపారు. పలువురు ఎంపీటీసీలు స్నేహితులు బంధువులు ఆయనకు శాలువాతో సత్కరించి అభినందించారు.




